ఆ బలహీనతనే మోసగాళ్లు క్యాష్‌ చేసుకుంటున్నారు

20 Mar, 2021 17:01 IST|Sakshi

ఒడిశా : దేశంలో పెట్రోల్‌ రేట్లు పెరిగినట్లు నిరుద్యోగుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఉద్యోగం ఇప్పిస్తామంటే చాలు నిరుద్యోగులకు అదో పండుగే. దీన్నిఆసరాగా చేసుకొని కొందరు మోసగాళ్ల నిరుద్యోగులకు ఉద్యోగం ఇప్పిస్తామంటూ అశ చూపి అందినంత వరకు దోచుకుంటున్నారు. అలాంటి వాళ్లను టార్గెట్ చేస్తున్న ఓ గ్యాంగ్‌కి ఒడిశా పోలీసులు చెక్ పెట్టారు. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్ టాటా పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ యువతను మోసం చేస్తున్నఐదుగురు అంతర రాష్ట్ర మోసగాళ్లను ఒడిశా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

అంతా ప్లాన్‌ ప్రకారం చేస్తారు
 అంగూల్ పోలీసు సూపరింటెండెంట్ జగ్మోహన్ మీనా మాట్లాడుతూ, ఈ ముఠా ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, బీహార్లలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి వారి వద్ద 8 లక్షల వరకు తీసుకుంటారు. అనంతరం వారికి ఎలాంటి అనుమానం రాకుండా నకిలీ నియామక పత్రాలను జారీ చేస్తుంటారు. తాము మోసపోయినట్లు నిరుద్యోగులు తెలుసుకునే సమయానిక అక్కడి నుంచి మకాం మార్చేస్తారు. ఈ దందా 2018 నుంచి జరుగుతోందని పోలీసులు దర్యాప్తులో బయటపడింది. అయితే గత నెలలో ఈ మోసగాళ్ల భాగోతం మొదట పోలీసుల దృష్టికి వచ్చింది. అంగూల్ జిల్లాకు చెందిన 59 ఏళ్ల ప్రణబంధు జెనా తన కొడుకుకి  ఉద్యోగం ఇప్పిస్తానంటూ మిశ్రా అనే వ్యక్తికి  4,50,000 నగదుని తీసుకున్నాడు. నెలలు గడిచిన తన కొడుకుకు ఎలాంటి ఉద్యోగం రాకపోయేసరకి మోసపోయాడని గ్రహించి జెనా పోలీసులను ఆశ్రయించాడు. 

ఐతే... పోలీసులు ఇంకైనా ప్రజలు ఇలాంటి మోసగాళ్లను నమ్మొద్దనీ, అడ్డదారుల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించవద్దని సూచిస్తున్నారు. ఒడిశా రాష్ట్రంలో సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నిర్వహించిన ఓ సర్వేలో నిరుద్యోగిత రేటు 10.7 శాతం పాయింట్లు పెరిగి 2020 ఏప్రిల్‌కు  23.8 శాతం నిరుద్యోగులు ఉన్నారని  తేలింది. ( చదవండిలక్నో కేంద్రంగా కాల్‌ సెంటర్‌.. నిరుద్యోగులకు వల

మరిన్ని వార్తలు