పెళ్లైన రెండు నెలలకే భర్త పైశాచికత్వం.. కట్టుకున్న భార్యను ముసలోడికి..

23 Oct, 2021 17:02 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

జైపూర్‌: పెళ్లయిన మొదట్లో భార్యభర్తల మధ్య అనుబంధం ఎంతో అన్యోన్యంగా ఉంటుంది. భార్యభర్తలిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమగా ఉండటం చూస్తే ఎవరికైనా ముచ్చటగా అనిపిస్తుంది. ఎంతో సరదాగా, సంతోషంగా కాలం ఇట్టే గడిచిపోతుంటుంది. అయితే పెళ్లి చేసుకుని తనతో తీసుకొచ్చిన భార్యను కంటికి రెప్పలా రక్షించుకోవాల్సింది పోయి మరో వ్యక్తికి అమ్మకానికి పెట్టాడు ఓ కీచక భర్త. పెళ్లైన రెండు నెలలకే కట్టుకున్న భార్యను ఓ ముసలోడికి రూ. లక్షా 80 వేలకు అమ్మేశాడు. పైగా ఈ శాడిస్టు భర్త 17 ఏళ్ల మైనర్‌ అవ్వడం గమనార్హం. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.
చదవండి: రెస్టారెంట్‌ విచిత్ర షరతు.. ఫైర్‌ అవుతున్న నెటిజన్లు!

వివరాలు.. ఒఢిశా రాష్ట్రం బొలంగిర్‌ జిల్లాకు చెందదిన రాజేష్‌ రానా అనే వ్యక్తికి సోషల్‌ మీడియా ద్వారా ఓ యువతితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అనంతరం ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి సంప్రదాయంగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు పెళ్లి తరువాత గత ఆగస్టులో ఇటుక బట్టీలో పని చేయడానికి భార్యభర్తలిద్దరూ రాజస్థాన్ వెళ్లారు. అక్కడ కొన్ని రోజులు ఇద్దరు కలిసి పనులు చేసుకుంటూ జీవించారు. అయితే అయితే కొత్త పనిలో చేరిన కొన్నిరోజులకు రాజేష్ తన భార్యను బరన్ జిల్లాకు చెందిన 55 ఏళ్ల వ్యక్తికి రూ. 1,80,000లకు విక్రయించాడు. భార్యను విక్రయించిన తర్వాత వచ్చిన డబ్బుతో విపరీతంగా జల్సాలు చేశాడు.
చదవండి: రైతు బతుకులో నిప్పులు పోసిన గ్యాస్‌.. బీరువాలో దాచిన రూ. 6 లక్షలు..

ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ కొని భార్య ఎవరితోనో పారిపోయిందని అమ్మాయి వాళ్ల తండ్రికి ఫోన్‌ చేసి చెప్పాడు. అయితే తమ కూతురు ఇలా చేయదని భావించిన యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న బొలంగిర్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఒడిశా నుంచి వచ్చిన పోలీసు బృందం బరన్‌ గ్రామానికి చేరుకొని మహిళ గురించి ఆరా తీశారు. అప్పుడే యువతిని 55 ఏళ్ల వ్యక్తికి భర్త అమ్మేశాడన్న విషయం పోలీసులకు తెలిసింది. దీంతో భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు