యువజంట చేసిన పనికి బంధువులంతా షాక్​..

4 Jun, 2021 21:17 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

భువనేశ్వర్​: ఒడిషా రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. భార్యభర్తలు ఇద్దరు  చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన మయుర్​భంజ్​లోని ధనసుల్​ గ్రామంలో జరిగింది. అయితే, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు  చనిపోయిన ఇరువురిని  చెట్టుపై నుంచి కిందకుదించారు. వారిని, బౌలా సింగ్​ (20), సిమా సింగ్​(18) లుగా గుర్తించారు. వారి శవాలను  ఆటోప్సి పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.

వీరి మరణాలపై స్పష్టమైన కారణాలు మాత్రం తెలియరాలేదు. అయితే, ఒక వేళ వీరిని ఎవరైనా హత్యచేసి ఇలా చెట్టుకు వేలాడ దీశారా లేక ఏదైనా ప్రేమ వ్యవహరం కారణమా అని పోలీసులు అనుమానిస్తున్నారు. యువజంట ఆత్మహత్య చేసుకున్న చెట్టు సమీపంలో  హిందూ దేవుళ్ల  ఫోటోలు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.

దీన్ని బట్టి వీరు ఆత్మహత్యకు పాల్పడే ముందు  దేవుడిని ప్రార్థించి ఉంటారని భావిస్తున్నారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు వీరి బంధువులను పిలిపించి విచారించగా ‘ ప్రస్తుతం తాము కూడా షాక్​లో ఉన్నట్లు తెలిపారు’. వీరు ఇలా చేస్తారని ఎప్పుడూ అనుకోలేదని అన్నారు.  అయితే, దీనిపై  మరింత లోతుగా దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు. 

చదవండి: తెలిసిన వారే కదా అని వెళ్తే ఎంత పనిచేశారు..

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు