సీసీ కెమెరాలో రికార్డు అవుతుందని.. విద్యుత్‌ సరఫరా నిలిపివేసి మరీ..

30 Jul, 2021 08:44 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, జగిత్యాల(కరీంనగర్‌): సీసీ కెమెరాలో రికార్డు అవుతుందని గ్రామంలో విద్యుత్‌ సరఫరా నిలిపివేసి వృద్ధురాలిని దారుణంగా హత్య చేసిన సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. జగిత్యాల రూరల్‌ మండలం వెల్దుర్తికి చెందిన బిరుదుల హన్మక్క (65) వ్యవసాయ కూలీగా పని చేస్తూ ఒంటరిగా జీవిస్తోంది. ఆమెకు కుమారుడుకాగా అదే గ్రామంలో మరోచోట నివసిస్తున్నాడు. బుధవారం రాత్రి హన్మక్కను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు గొంతు నులిమి హత్య చేసి ఇంటి సమీపంలోని మురికికాలువలో పడేశారు.

గురువారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా రూరల్‌ సీఐ కృష్ణకుమార్‌ ఆధ్వర్యంలో ఎస్సై చిరంజీవి గ్రామానికి చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వివరాలు సేకరించారు. మృతురాలి కొడుకు లక్ష్మణ్‌ ఫిర్యాదు మేరకు విచారణ వేగవంతం చేశారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక టీంను పోలీసులు ఏర్పాటు చేశారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు