బంగారం కోసం.. వృద్ధురాలి దారుణ హత్య

20 Nov, 2021 21:24 IST|Sakshi

మహదేవపూర్‌:జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం సర్వాయిపేట గ్రామానికి చెందిన లంగారి లక్ష్మీ(65) అనే వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. బంగారు నగల కోసమే గుర్తు తెలియని వ్యక్తులు వృద్ధురాలిని హృతచేసి ఉంటారని మహదేవపూర్ పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మహదేవపూర్ సీఐ కిరణ్ క కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పలిమెల మండలంలోని సర్వాయిపేట గ్రామానికి చెందిన లంగారి లక్ష్మీ అనే వృద్ధురాలు కనిపించడం లేదని ఆమె పెద్ద కుమారుడు లంగారి మురళి 2021 నవంబరు 16వ తేదీన ఫిర్యాదు చేశారు. వృద్ధురాలి ఆచూకి కోసం పోలీసులు గాలించగా గ్రామ శివారులో ఉన్న పాతబావిలో మృతదేహాన్ని శనివారం సాయంత్రం గుర్తించారు. 
బంగారం కోసమే
వృద్ధురాలు కనిపించకుండా పోయిన రోజు నుండి ఆమెకు చెందిన బంగారు నగలు కనిపించడం లేదని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. బంగారు నగల కోసమే హత్య జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు సీఐ పేర్కొన్నారు. త్వరలోనే నిందితుల్ని పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
 

మరిన్ని వార్తలు