వన్‌ డ్రైవ్‌ రెస్టారెంట్‌ కేసు: జువైనల్‌ హోంకు బాలుడి తరలింపు 

24 Sep, 2021 08:51 IST|Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌(హైదరాబాద్‌): జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.10లోని ఓ ఫుడ్‌కోర్ట్‌ బాత్‌రూమ్‌లో సెల్‌ఫోన్‌ కెమెరా ఆన్‌ చేసి ఉంచి వీడియో రికార్డు చేసిన ఘటనలో నిందితుడైన మైనర్‌ బాలుడి(17)ని జువైనల్‌ హోమ్‌కు పంపించగా మేనేజర్‌ శ్రీకాంత్‌ను జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

మూడు రోజులుగా ఇక్కడ హౌజ్‌ కీపింగ్‌ బాయ్‌ ఓ బాత్‌రూమ్‌లో కెమెరా ఏర్పాటు చేయగా ఓ యువతి గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొబైల్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు 20 మంది యువతుల నగ్న దృశ్యాలు ఉన్నట్లు గుర్తించారు. మొబైల్‌లో మొత్తం 5 గంటల ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు.   

చదవండి: Jubilee Hills:వాష్‌రూమ్‌లో స్పై కెమెరా: వన్‌ డ్రైవ్‌ రెస్టారెంట్‌పై కేసు నమోదు

మరిన్ని వార్తలు