ఆన్‌లైన్‌ వ్యభిచార ముఠా గుట్టురట్టు

30 Jul, 2020 08:04 IST|Sakshi

కీసర: సామాజిక మాధ్యమాల ద్వారా అందమైన యువతుల ఫొటోలు చూపుతూ  వ్యభిచారం నిర్వహిస్తున్న   ముఠాను కీసర పోలీసులు,  మాల్కాజ్‌గిరి ఎస్‌ఓటీ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. కీసర సీఐ నరేందర్‌గౌడ్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన  వంశీరెడ్డి, విజయవాడకు చెందిన అంజలీ, చిన్నలతో కలిసి ముఠాగా  ఏర్పడ్డారు.  ఈ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులను  నగరానికి రప్పించి బల్కంపేటలోని ఓ ఇంట్లో నిర్భందించి, వారితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నట్లు తెలిపారు. సోషల్‌ మీడియాలో సదరు యువతల ఫొటోలను పంపి విటులను ఆకర్షించేవారు. అనంతరం విటుల నుంచి ఆన్‌లైన్‌లో  డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేయించుకుని అమ్మాయిలను సరఫరా చేసేవారన్నారు.

ఈ నేపథ్యంలో బుధవారం  వంశీరెడ్డి నలుగురు యువతులను తీసుకొని నాగారం రాంపల్లిచౌరస్తాకు వచ్చినట్లు సమాచారం అందడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.   ఈ ముఠాచేతిలో బంధీలుగా ఉన్న పశ్చిమబెంగాల్‌కు చెందిన ముగ్గురు, విజయవాడకు చెందిన ఒక యువతిని కాపాడి పునరావాస కేంద్రానికి తరలించినట్లు తెలిపారు. ముఠా నిర్వాహకురాలు  అంజలి,  ఆమె సహాయకుడు  చిన్న పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారి కోసం ప్రత్యేక బృందాలను   ఏర్పాటు చేశామని, త్వరలో పట్టుకుంటామని సీఐ తెలిపారు. రాచకొండ సీపీ  మహేష్‌భగవత్‌ పర్యవేక్షణలో అడిషనల్‌ డిప్యూటి కమిషనర్‌   సురేందర్‌రెడ్డి,  ఆధ్వర్యంలో  మల్కాజ్‌గిరి ఎస్‌ఓటీ ఇన్స్‌పెక్టర్‌ నవీన్‌కుమార్,  కీసర సీఐ నరేందర్‌గౌడ్‌ , ఎస్సై శ్రీకాంత్‌ దాడుల్లో పాల్గొన్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. 

మరిన్ని వార్తలు