ఆపరేషన్‌ ‘మేఘ్‌చక్ర': సీబీఐ మెరుపు దాడుల్లో 50 మంది అరెస్టు

24 Sep, 2022 21:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల కంటెంట్‌తో  మైనర్లపై బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్న ముఠాల పని పట్టేందుకు ఆపరేషన్‌ ‘మేఘ్‌చక్ర’తో సీబీఐ శనివారం మెరుపుదాడులు నిర్వహించింది.   దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో 59 ప్రదేశాల్లో దాడులు జరిపింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణ, చిత్తూరు జిల్లాల్లో అధికారులు తనిఖీలు చేశారు.  తెలంగాణలో హైదరాబాద్‌లో విస్తృత సోదాలు నిర్వహించారు.

న్యూజీల్యాండ్‌లోని ఇంటర్‌పోల్ యూనిట్ సమాచారంతో సీబీఐ అధికారులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. క్లౌడ్ స్టోరేజిని ఉపయోగిస్తూ చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్‌ను సర్క్యులేట్ చేస్తున్న నిందితులను గుర్తించారు. దాడుల్లో 50 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. భారీ ఎత్తున ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. బాలలపై జరుగుతున్న లైంగిక హింస, వీడియో చిత్రీకరణపై విచారణ బాధితులను గుర్తించేందుకు సీబీఐ ప్రత్యేక నిఘా పెట్టింది.
చదవండి: దారుణం.. ఉపాధ్యాయుడిపై పదో తరగతి విద్యార్థి కాల్పులు

మరిన్ని వార్తలు