స్నేహితురాలితో పెళ్లి.. 7 నెలలు గడిచిన తర్వాత..

24 Nov, 2021 10:08 IST|Sakshi
అత్తవారింటి ముందు న్యాయం కోసం మౌన పోరాటం చేస్తున్న బాధితరాలు తపస్విని

బరంపురం(భువనేశ్వర్‌): భర్త ఇంటి ఎదుట భార్య మౌన దీక్షకు దిగిన సంఘటన నగరంలో మంగళవారం సంచలనం రేకిత్తించింది. కొన్నాళ్ల పాటు స్నేహితులుగా మెలిగిన యువతి తపస్విని దాస్, వైద్యుడు సునీత్‌ సాహు కోర్టు సమక్షంలో రిజిస్టర్‌ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఒకే ఇంట్లో కలిసి ఉండి, శారీరకంగా ఒక్కటయ్యారు. ఇలా దాదాపు 7 నెలలు గడిచిన తర్వాత తపస్విని వదిలి, సునీత్‌ సాహు అక్కడి నుంచి పరారయ్యాడు.

దీంతో ఆవేదన వ్యక్తం చేస్తూ తపస్విని నగరంలోని బ్రహ్మనగర్‌లో తన అత్తవారింటి ఎదుట మౌన పోరాటానికి దిగింది. ఆమెకి స్థానిక సంఘ సేవకురాలు ప్రమీల మద్దతు పలికారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులకు బాధితురాలు తన గోడుని వివరించింది. తన భర్త తనకు కావాలని, తీసుకురావాలని పోలీసులను ఆమె కోరింది.

చదవండి: ‘మా పొట్ట కొట్టకండి సారూ.. గంజాయి పండించుకుంటాం’

మరిన్ని వార్తలు