3 నెలలుగా బాలికపై యజమాని అఘాయిత్యం

6 Jan, 2021 09:02 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పట్టణంలోని సతీష్‌(40) పూల దుకాణంలో కొంతకాలంగా పనిచేస్తోన్న బాలిక(14)

సాక్షి, శంషాబాద్‌: పూల దుకాణం యజమాని ఓ బాలికపై మూడు నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్న ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాలిలాన్నాయి. స్థానిక హుడా కాలనీలో నివసించే బాలిక(14) పట్టణంలోని సతీష్‌(40) పూల దుకాణంలో కొంతకాలంగా పనిచేస్తోంది. బాలికను బైక్‌పై ఇంటి వద్ద వదిలేసే క్రమంలో మూడు నెలలుగా బాలికపై లైంగిక దాడి చేస్తున్నాడు. ఇటీవల అనారోగ్యంతో ఉన్న సమయంలో కూడా దారుణానికి ఒడిగట్టేందుకు యత్నించడంతో బాలిక అఘాయిత్యాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది. దీంతో కుటుంబసభ్యులు మంగళవారం ఆర్‌జీఐఏ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు బాలికను వైద్య పరీక్షలకు పంపారు. సతీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాలకార్మికురాలిని పనిలో పెట్టుకోవడంతో పాటు అత్యాచారానికి ఒడిగట్టిన అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు