ముక్కులో ఇరుక్కున్న శ్వాబ్‌.. డాక్టర్‌పై దాడి

23 May, 2021 16:55 IST|Sakshi

ముంబై : కరోనా వైరస్‌ శాంపిల్‌ సేకరణలో చోటుచేసుకున్న పొరపాటు కారణంగా ఓ డాక్టర్‌ చావుదెబ్బలు తిన్నాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొద్ది రోజుల క్రితం పాల్‌ఘర్‌ జిల్లా విరార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధికి చెందిన ఓ మహిళ కరోనా పరీక్షలు చేయించుకోవాటానికి దగ్గరలోని ఆసుపత్రికి వెళ్లింది. అక్కడి లాబ్‌ టెక్నీషియన్‌ ఆమెకు ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్‌ నిమిత్తం శాంపిల్‌ తీయటానికి స్వాబ్‌ను ఆమెను ముక్కులో పెట్టాడు.

ఈ నేపథ్యంలో ఆ స్వాబ్‌ విరిగి సగ భాగం అందులోనే ఉండిపోయింది. దీంతో ఆగ్రహించిన ఆమె బంధువులు లాబ్‌ టెక్నీషియన్‌ను బూతులు తిట్టడం మొదలుపెట్టారు. అక్కడికి వచ్చిన ఓ వైద్యుడిపై దాడికి పాల్పడ్డారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

చదవండి : పెళ్లి సంబరాల్లో కాల్పులు.. పదేళ్ల బాలిక మృతి 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు