ఘోర ప్రమాదం.. నాపరాళ్లు మీదపడి ముగ్గురు కూలీలు మృతి

4 Sep, 2022 08:54 IST|Sakshi

సాక్షి,పల్నాడు: జిల్లాలోని నకరికల్లు మండలం శాంతి నగర్ వద్ద ఘోర ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. నాపరాళ్లతో మాచర్ల నుంచి భీమవరం వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో నాపరాళ్ళు మీద పడి లారీలో ప్రయాణిస్తున్న ముగ్గురు కూలీలు మృతి చెందారు. వీరిని మాచర్ల పసర్లపాడుకు చెందిన అమారేసు శ్రీను, దొడ్డ భాస్కరరావు, రమావత్ మునినాయక్ గా గుర్తించారు. మృతదేహాలను నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చదవండి: బైక్‌ను తాకాడని దళిత విద్యార్థి గొంతు పిసికిన టీచర్‌

మరిన్ని వార్తలు