హైదరాబాద్‌: అపార్టుమెంట్‌లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం

22 May, 2022 10:09 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: అపార్టుమెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న పంజగుట్ట పోలీసులు దాడిచేసి నిర్వాహకుడు, విటుడు, వీరికి సహకరించే వాచ్‌మెన్‌ను అరెస్టు చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బీఎస్‌ మక్తాలోని ఓ అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌లో వ్యభిచారం జరుగుతోందనే పక్కా సమాచారంలో పంజగుట్ట క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ టి.నరసింహరాజు తమ సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు చేశారు.

ఇందులో సబ్‌ ఆర్గనైజర్‌ బీఎస్‌ మక్తాకు చెందిన దుర్గాప్రసాద్‌(26), విటుడు శేరిలింగంపల్లికి చెందిన షేక్‌ తాహేర్‌(28), వ్యభిచార నిర్వహణకు సహకరిస్తున్న వాచ్‌మెన్‌ చంద్రయ్యను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 4 వేలు, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్‌బెంగాల్‌కు చెందిన మహిళలను రెస్క్యూహోంకు తరలించారు. ప్రధాన నిర్వాహకుడు అమర్‌ అలియాస్‌ ప్రేమ్‌ పరారీలో ఉన్నట్లు తెలిపారు. 
చదవండి: హైదరాబాద్‌: నిషేధిత హారన్‌ కొడుతూ రోడ్లపై దూసుకుపోతున్నారా.. తస్మాత్‌ జాగ్రత్త!

మరిన్ని వార్తలు