వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై హత్యాయత్నం.. చక్రం తిప్పిన పరిటాల బంధువు

30 Apr, 2022 08:07 IST|Sakshi

రామగిరి: మండలంలో ఈనెల 4న జరిగిన హత్యాయత్నం కేసులో నిందితులు బోయ బ్రహ్మ, బోయ భరత్‌ మాజీ మంత్రి పరిటాల సునీత సమీప బంధువు ఎల్‌.నారాయణచౌదరి ఇంట్లో తలదాచుకోవడం సంచలనం రేకెత్తించింది.  

ఈనెల 4న సుద్దకుంటపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త రఘునాయక్‌పై బోయ బ్రహ్మ, బోయ భరత్‌ దాడికి పాల్పడ్డారు. గురువారం రాత్రి అనంతపురంలో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు..ఎస్‌ఐ జనార్ధన్‌నాయుడు తమ సిబ్బందితో వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీకేసుతోపాటు అటెంప్ట్‌ మర్డర్‌ కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి వారు పరారీలో ఉన్నారు.

శుక్రవారం ధర్మవరం డీఎస్పీ రమాకాంత్‌ ఎదుట నిందితులను ఎస్‌ఐ హాజరుపరిచారు. నిందితులను అనంతపురంలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎస్‌ఐ జనార్దన్‌నాయుడు మాట్లాడుతూ ధర్మవరంలో డీఎస్పీ ఎదుట హాజరపరిచి, నిందితులను రిమాండ్‌కు తరలించనున్నట్లు తెలిపారు.   

ఇది కూడా చదవండి: బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్యకేసులో సంచలన తీర్పు

మరిన్ని వార్తలు