చెన్నై ఎయిర్‌పోర్టులో బంగారం స్వాధీనం 

1 Jul, 2021 08:52 IST|Sakshi

సాక్షి, తిరువొత్తియూరు(తమిళనాడు): చెన్నై విమానాశ్రయంలో దుబాయ్‌ నుంచి లోదుస్తుల్లో తీసుకొచ్చిన రూ.31 లక్షల విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయానికి దుబాయ్‌ నుంచి ప్రత్యేక విమానం బుధవారం ఉదయం చేరుకుంది. ఇందులో పెద్దమొత్తంలో బంగారం తరలిస్తున్నట్లు కస్టమ్స్‌శాఖ కమిషనర్‌ రాజన్‌కు సమాచారం అందింది. దీంతో సిబ్బంది తనిఖీలు చేపట్టారు.

ఆ సమయంలో కడలూరుకు చెందిన బసూలుద్ధీన్‌ (26)ను పరిశీలించగా.. అతని లోదుస్తులలో రూ.31 లక్షల 50 వేల విలువైన 650 గ్రాముల బంగారం తీసుకొచ్చినట్లు గుర్తించారు. దీంతో పోలీసులు బసూలుద్దీన్‌ను అరెస్టు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. 

చదవండి: లైంగిక ఆరోపణలు: జైలు నుంచి నటుడి విడుదల.. బాధితుల ఆక్రోదన 

మరిన్ని వార్తలు