చిన్నపాటి ఘర్షణ.. ఆసుపత్రిలోనే పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు

12 Jun, 2021 11:12 IST|Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా ఆసుపత్రిలో చోటుచేసుకున్న దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రిలో ఒక వ్యక్తి తనతో గొడవపడిన మరో వ్యక్తిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. దీనికి సంబంధించిన సన్నివేశాలు ఆసుపత్రి సీసీ టీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం బాధితుడు కాలిన గాయాలతో సాగర్ బుందేల్ ఖండ్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడు.

వివరాలు.. దామోదర్‌ కోరి, మిలన్ మాచే రజాక్‌ మధ్య గురువారం(జూన్‌ 10న) ఏదో విషయంలో చిన్నపాటి గొడవ జరిగింది. ఈ ఘర్షణలో దామోదర్‌ కోరికి గాయాలు కావడంతో చికిత్స చేయించుకునేందుకు బుందేల్ ఖండ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి వచ్చాడు. అయితే తనతో గొడవపడిన కోరిపై ఆగ్రహంతో ఉన్న మిలన్‌ మాచే కొన్ని గంటల తర్వాత కోరి ఉన్న ఆసుపత్రికి వచ్చాడు. ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని బయటకు వస్తున్న కోరీపై పెట్రోల్‌ పోసి తన వద్ద ఉన్న లైటర్‌తో నిప్పు అంటించి అక్కడినుంచి పరారయ్యాడు.

దాదాపు 50 శాతం కాలిన గాయాలతో కిందపడిపోయిన కోరిని వెంటనే ఐసీయూకి తరలించి చికిత్స నిర్వహించారు. కాగా మిలన్‌ మాచే కోరికి నిప్పు అంటించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని.. సీసీటీవీ, బాధితుడి వాంగ్మూలం ఆధారంగా నిందితుడు మిలన్ మాచే రజాక్ ను పోలీసులు అరెస్టు చేశారు. సెక్షన్ 307 ప్రకారం హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. 
చదవండి: స్థల వివాదం; వెంటాడి.. వివస్త్రను చేసి  

‘న్యూడ్‌ కాల్‌ చేస్తావా.. ఫొటోస్‌ అప్‌లోడ్‌ చేయలా?’

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు