అసభ్య మెసేజ్‌లు పంపి పెళ్లి చెడగొట్టే యత్నం..

18 Mar, 2021 08:52 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: వివాహం నిశ్చయమైన అమ్మాయికి, ఆమె కుటుంబ సభ్యులకు అసభ్యకరమైన మేసేజ్‌లు పంపుతూ పెళ్లి చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్న యువకుడిని సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బేగంబజార్‌కు చెందిన బాధితురాలికి ఇటీవల పెళ్లి కుదిరింది. అయితే ఆమెతో పాటు కుటుంబ సభ్యులకు ఇటీవల అసభ్యకరమైన మేసేజ్‌లు వస్తున్నాయి. దీనిపై బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు బేగంబజార్‌లో కిరాణ దుకాణం నిర్వహించే వివేక్‌గా గుర్తించారు. బుధవారం నిందితుడిని అరెస్ట్‌ చేశారు. విచారణలో నిందితుడు, బాధితురాలికి బంధువని తేలింది.  

మరిన్ని వార్తలు