కామాంధునికి 20 ఏళ్ల జైలు  

10 Sep, 2021 06:58 IST|Sakshi

మైసూరు: మూడున్నరేళ్ల పసిపాపపై లైంగికదాడికి పాల్పడిన కామాంధునికి కోర్టు 20 ఏళ్ల జైలు శిక్షను విధించింది. హుణసూరు తాలూకాలోని జగదీష్‌ (45) దోషి. ఇతను 2019లో హుణసూరు తాలూకా బిళకెరె పోలీసుస్టేషన్‌ పరిధిలోని గ్రామంలో ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిని ఎత్తుకెళ్లి అకృత్యానికి పాల్పడ్డాడు.  పోక్సో కోర్టులో నేరం రుజువు కావడంతో జడ్జి శ్యామ్‌ కంరోస్‌.. 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.50 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. 

మరిన్ని వార్తలు