దారుణం: కూలీ ప్రాణం తీసిన పెంపుడు కుక్క

13 May, 2021 13:26 IST|Sakshi
కార్మికుడి మృతికి కారణమైన పిట్‌ బుల్‌ జాతి రకం కుక్క

సాక్షి, బెంగళూరు: నిర్మాణ స్థలంలో మెట్ల కింద నిద్రిస్తున్న కూలీని యజమాని పెంపుడు కుక్క దాడి చేసింది. ఆ కుక్క చేతిలో తీవ్రంగా గాయపడి అతడు మృతి చెందాడు. ఈ దాడిని ఆపడానికి ప్రయత్నించిన యజమానిని కూడా ఆ కుక్క గాయపరిచింది. దీంతో ఆ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన కర్నాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది.

బెంగళూరులోని అత్తూర్ లేఅవుట్ ప్రాంతంలో భవన నిర్మాణ కార్మికుడు నరసింహ (36) పని చేసేందుకు వచ్చాడు. నిర్మాణం జరుగుతున్న స్థలంలో మెట్ల కింద నరసింహ నిద్రిస్తున్నాడు. ఈ సమయంలో యజమాని తన విదేశీ (పిట్‌ బుల్‌) జాతికి చెందిన పెంపుడు కుక్కతో అక్కడకు చేరింది. అకస్మాత్తుగా ఆ కార్మికుడిపై కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. అతడి మెడను పట్టుకుని కొరికేసింది. అయితే కుక్క అదుపు చేయడానికి వెళ్లగా యజమానికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. నరసింహ అరుపులు విని తోటి కార్మికులు అక్కడికి చేరుకుని వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నరసింహ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఒక వ్యక్తి మరణానికి కారణమైన కుక్క యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

చదవండి: అర్ధరాత్రి రౌడీ షీటర్‌ హల్‌చల్‌.. పోలీసుల ఎన్‌కౌంటర్‌
చదవండి: దారుణం.. వేశ్యను వాడుకుని డ్రైనేజీలో పారవేత

మరిన్ని వార్తలు