దారుణం: ఎస్‌ఐ ఇంటిపై పెట్రో బాంబు దాడి

21 Jun, 2021 10:05 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, వేలూరు(తమిళనాడు): తిరువణ్ణామలై తూర్పు డివిజన్‌ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్‌ఐ సుందర్‌ ఇంటిపై దుండగులు పెట్రో బాంబు వేశారు. దీంతో కారు, బైకులు కాలిపోయాయి. ఎస్‌ఐ సుందర్‌ తిరువణ్ణామలై మత్తలకులం వీధిలో నివాసం ఉంటున్నాడు. శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఎస్‌ఐ ఇంటిపై పెట్రో బాంబు వేసి అక్కడి నుంచి పరారయ్యారు.

ఇంటి ముందు ఉన్న కారు, బైకులు కాలిపోయాయి. మంటలు చెలరేగుతు న్న విషయాన్ని గమనించిన స్థానికులు అక్కడికి చేరుకుని సుమారు గంట పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ఎస్‌ఐ సుందర్‌ తూర్పు డివిజన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పాత కక్షలు కారణంగా పెట్రో బాంబు వేశారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.  

చదవండి:  దారుణం: గూగుల్‌లో ‘చంపి.. పాతేయడం ఎలా?’

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు