28 రోజులు మృత్యువుతో పోరాడి.. 

16 Oct, 2020 02:22 IST|Sakshi

ఖమ్మం క్రైం: కామాంధుడి చేతిలో అత్యాచారయత్నానికి గురైన ఓ బాలిక 28 రోజుల పాటు మృత్యువుతో పోరాడి గురువారం కన్నుమూసింది. ఖమ్మం రూరల్‌ మండలం పల్లెగూడేనికి చెందిన ఓ వ్యక్తి తన కూతురును (13) ముస్తఫానగర్‌ పార్శిబంధంలోని అల్లం సుబ్బారావు ఇంట్లో పనిమనిషిగా కుదిర్చాడు. గత నెల 18న రాత్రి బాలిక పని ముగించుకుని నిద్రిస్తుండగా, సుబ్బారావు కుమారుడు మారయ్య అత్యాచారానికి యత్నించాడు.

విషయం బయట పడుతుందని భావించి.. ఆమెపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. మంటల ధాటికి ఆమె కేకలు వేయడంతో పైన నిద్రిస్తున్న నిందితుడి తండ్రి సుబ్బారావు కిందకు చేరుకుని మంటలను ఆర్పివేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ముందుగా ఖమ్మం, అనంతరం హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం బంజారాహిల్స్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ గురువారం ఆమె తుదిశ్వాస విడిచింది. శుక్రవారం బాలిక మృతదేహాన్ని ఖమ్మం తీసుకురానున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు