బైక్‌పై డ్రాప్‌ చేస్తామని తీసుకెళ్లి.. యువతిపై లైంగిక దాడి 

3 Sep, 2022 08:17 IST|Sakshi
నిందితులు దీపు, అఖిలేష్‌  

సాక్షి, బెంగళూరు: బెంగళూరులో కామాంధులు రెచ్చిపోయారు. ఓ యువతిని డ్రాప్‌ పేరుతో బైక్‌పై ఎక్కించుకొని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. వివేక్‌ నగర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఈజీపుర సమీపంలో ఉన్న హెచ్‌ఏఎల్‌ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. గత నెల 31వ తేదీన ఓ యువతి ఈజీపుర సమీపంలో అద్దె ఇంటికోసం గాలింపు చేపట్టింది. సాయంత్రం కావడంతో  తానున్న ఇంటికి వెళ్లేందుకు బస్సు కోసం వేచి చూస్తుండగా బైకులో వచ్చిన ఇద్దరు యువకులు డ్రాప్‌ పేరుతో ఆమెను వాహనంలో ఎక్కించుకున్నారు.

అనంతరం హెచ్‌ఏఎల్‌ సమీపంలోని నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లారు. అక్కడ ఆ యువతికి బలవంతంగా మద్యం తాపించారు. అనంతరం ఇద్దరూ అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ఇంటికి వెళ్లి జరిగిన ఘటనను వివరించింది. దీంతో కుటుంబ సభ్యులు వివేక్‌నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చేపట్టి అఖిలేష్, దీపు అనే ఇద్దరిని అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు