షాకింగ్‌ ఘటన.. ఇంట్లోకి దూసుకెళ్లిన విమానం

24 Mar, 2023 09:11 IST|Sakshi

జార్ఖండ్‌: ధన్‌బాద్‌లో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. గ్లైడర్‌ విమానం ఇంట్లోకి దూసుకెళ్లింది. బార్‌వాడా ఎయిర్‌స్ట్రిప్‌ నుంచి టేకాప్‌ అయిన కాసేపటికే ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పైలట్‌ సహా పద్నాలుగేళ్ల బాలుడు గాయపడ్డారు. ధన్‌బాద్‌లోని బర్వాడ్డ ఏర్‌స్ట్రిప్‌ నుంచి చిన్న విమానం బయలుదేరింది.

టేక్‌ఆఫ్‌ అయిన కొద్దిసేపటికే విమానం ఎయిర్‌పోర్టుకు ఐదు వందల మీటర్ల దూరంలో ఉన్న ఓ ఇంటిని ఢీకొట్టగా, అందులో ఉన్న పైలట్‌, బాలుడు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని ఆసుపత్రికి తరలించారు. ఇంట్లో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని ఇంటి యజమాని తెలిపారు.


చదవండి: అమృత్‌పాల్‌ కేసులో ఊహించని ట్విస్ట్‌.. ఆమె అరెస్ట్‌

మరిన్ని వార్తలు