ప్లస్‌వన్‌ విద్యార్థిని కిడ్నాప్‌

1 Jul, 2021 08:19 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తిరువొత్తియూరు: ప్లస్‌వన్‌ విద్యార్థినిని కిడ్నాప్‌ చేసిన కేసులో కళాశాల విద్యార్థితో సహా నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కృష్ణగిరి జిల్లా కావేరి పట్టణం సమీపంలో జైనూరుకు చెందిన బాలిక అదే ప్రాంతంలో ఉన్న పాఠశాలలో ప్లస్‌వన్‌ చదువుతోంది. ఈనెల 26వ తేదీ ఇంటిలో ఉన్న విద్యార్థిని హఠాత్తుగా అదృశ్యమైంది. ఈ విషయంపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో కావేరి పట్టణ సమీపంలో ఉన్న నెడుగళ్‌ గ్రామానికి చెందిన ప్రైవేటు కళాశాలలో మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థి సూర్య (26) తన కుమార్తెను వివాహం చేసుకుంటానని మాయమాటలు చెప్పి కిడ్నాప్‌ చేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారానికి సాలే గూలీ సెలసనాం పట్టి జగన్నాథన్‌ (35), ముత్తులక్ష్మి (27), పళణియమ్మాళ్‌ (46) తదితరులు సహకరించినట్లు తెలిపారు. దీంతో కృష్ణగిరి మహిళా పోలీసు ఇన్‌స్పెక్టర్‌ మహాలక్ష్మి కేసు నమోదు చేసి అదృశ్యమైన బాలికను మంగళవారం విడిపించారు. కళాశాల విద్యార్థితో సహా నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు