రెండున్నరేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసులో సంచలన తీర్పు

21 Jan, 2021 15:01 IST|Sakshi

లక్నో : రెండున్నరేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసులో ఘజియాబాద్‌ ప్రత్యేక పోక్సో కోర్టు బుధవారం నిందితులకు మరణశిక్ష విధించింది. విచారణ అనంతరం కేవలం 29 రోజుల రికార్డు సమయంలోనే సంచలన తీర్పును వెలువరించింది. వివరాల ప్రకారం..అక్టోబర్‌19న ఘజియాబాద్‌ కవి నగర్‌ ప్రాంతానికి చెందిన రెండున్నరేళ్ల చిన్నారి హత్యాచారానికి గురయ్యింది. రోడ్డు పక్కనే ఉన్న చెట్ల పొదల్లో బాలిక మృతదేహం కనిపించింది. బాలిక  తండ్రికి సన్నిహితుడైన చందన్‌ అనే వ్యక్తే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడయ్యింది. (కొడుకును చంపించడానికి రూ.3 లక్షల సుపారీ )

ఈ మేరకు డిసెంబర్‌29నే చార్జిషీట్‌ దాఖలు చేసినట్లు డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ అవినాష్ కుమార్ తెలిపారు. తీర్పు వెలువరించే రోజు సైతం పదిమంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. సాక్షాదారాలను పరిశీలించిన అనంతరం నిందితుడికి మరణశిక్ష విధిస్తూ న్యాయమూర్తి మహేంద్ర శ్రీవాస్తవ తీర్పు నిచ్చారు. కాగా ఇది ఓ సంచలన నిర్ణయమని, రికార్డు సమయంలోనే నిందితుడికి మరణశిక్ష విధిస్తూ తీర్పురావడం ఓ మైలురాయి అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉత్కర్ష్ వాట్స్ అన్నారు. (పోకిరీ చేతిలో వ్యక్తి హతం)

మరిన్ని వార్తలు