రాహుల్‌ హత్యకేసు కొలిక్కి 

24 Aug, 2021 03:53 IST|Sakshi
కోరాడ విజయకుమార్‌ , కోగంటి సత్యం

పోలీసుల అదుపులో ప్రధాన నిందితులు 

బెంగళూరు ఎయిర్‌పోర్టులో కోగంటిని పట్టుకున్న పోలీసులు 

సాక్షి, అమరావతి బ్యూరో: పారిశ్రామికవేత్త రాహుల్‌ హత్యకేసు కొలిక్కి వచ్చింది. ఇప్పటికే ప్రధాన నిందితుడు కోరాడ విజయకుమార్‌తోపాటు మిగిలిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. కోగంటి సత్యంను సోమవారం బెంగళూరు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారిస్తున్న పోలీసులు.. హత్యకు దారితీసిన పరిస్థితులు, ఎలా హత్య చేశారనే దానిపై అవగాహనకు వచ్చినట్లు తెలిసింది.

కోరాడ విజయకుమార్‌ వద్ద పనిచేసే వారే ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్యలో 10 మందికిపైగా పాత్ర ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసులో గాయత్రి అనే మహిళ పాత్ర పరోక్షంగా ఉన్నట్లు తెలిసింది. రాహుల్‌కు, ఆమెకు కూడా ఆర్థిక లావాదేవీల విషయమై విభేదాలున్నట్లు సమాచారం. ప్రధానంగా కంపెనీ లావాదేవీలకు సంబంధించి రాహుల్, కోరాడ విజయకుమార్‌ల పంచాయితీలో కోగంటి సత్యం ఉన్నట్లు తెలిసింది. హత్య జరిగిన వెంటనే వేగంగా స్పందించిన పోలీసులు వీలైనంత త్వరగా నిందితులను బహిరంగపరిచి కేసును తేల్చే దిశగా అడుగులు వేస్తున్నారు. 

మరిన్ని వార్తలు