చదివింది ఎమ్మెస్సీ.. అమ్మేది గంజాయి

6 Jun, 2021 08:07 IST|Sakshi
పట్టుబడ్డ గంజాయి- నిందితుల వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ మురళీకృష్ణ

తిరుపతి క్రైం: ఉన్నత చదువులు చదివిన ఇద్దరు వ్యక్తులు గంజాయి విక్రయిస్తూ తిరుపతి పోలీసులకు పట్టుబడ్డారు. తిరుచానూరు రోడ్‌ కెనడీనగర్‌లోని ఓ ఇంట్లో శనివారం 1,350 గ్రాముల గంజాయిని ఈస్ట్‌ డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో సీఐ శివ ప్రసాద్‌రెడ్డి సీజ్‌ చేశారు. వారు తెలిపిన వివరాల మేరకు.. స్థానికుడు శివయ్య ఎమ్మెస్సీ చదువుకున్నాడు.

అదేవిధంగా కర్నూలుకు చెందిన జయప్రకాష్‌ ఫిజియోథెరపీ మెడికల్‌ కాలేజ్‌లో చదివాడు. వీరిద్దరూ పాత పరిచయం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించేందుకు గాను.. గంజాయిని విక్రయించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో బైరాగిపట్టెడలోని మోనిషా అనే వ్యక్తి వద్ద రూ.16 వేలకు కొనుగోలు చేసి గంజాయిని ప్యాకెట్ల రూపంలో రూ.200 నుంచి రూ.300 వరకు విక్రయించేవారు. శనివారం ఉదయం కెనడీ నగర్లోని వారి నివాసంలో దాడులు నిర్వహించగా శివయ్య, జయప్రకాష్‌ ప్యాకెట్లు కడుతుండగా అరెస్ట్‌ చేశారు.

మాదక ద్రవ్యాలపై దండయాత్ర  
అర్బన్‌ జిల్లా ఎస్పీ వెంకటప్పల నాయుడు ఆదేశాల మేరకు శనివారం తిరుపతిలో మాదక ద్రవ్యాలపై పోలీసుల దండయాత్ర ప్రారంభించారు. గుట్కా, గంజాయి వంటి మత్తుపదార్థాల విక్రయాలపై ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గుట్కా, గంజాయిని స్వాదీనం చేసుకున్నారు.

చదవండి: 9 బృందాలు.. 36 గంటలు  
అడ్డుగా ఉందని చంపేశాడు

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు