ఇన్‌స్టాలో పరిచయం.. మాయమాటలు చెప్పి.. చివరికి బాలిక తల్లిదండ్రులు వెళ్లి

23 Jul, 2023 17:01 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తిరువొత్తియూరు(చెన్నై): ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయమైన ఓ బాలిక వీడియో, ఫొటోలను సామాజిక మాధ్యమంలో ఉంచుతానని బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్న యువకుడిని పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. కళ్లకురిచ్చి జిల్లా ఊలందూర్‌పేట ఉలుందాండవర్‌ ఆలయం వీధికి చెందిన సతీష్‌ కుమార్‌ (21)కు తేని జిల్లాకు చెందిన బాలిక (17)తో ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం చేసుకున్నాడు. ఈ క్రమంలో బాలికకు మాయ మాటలు చెప్పి ఊలందూరుపేటకు రమ్మని పిలిచాడు.

దీంతో ఈ ఏడాది మే 3వ తేదీ అక్కడికి వెళ్లింది. ఇద్దరూ కలిసి తిరిగినట్లు తెలిసింది. బాలిక తల్లిదండ్రులు మే 5వ తేదీ ఊలందూరుపేటకు వెళ్లి సతీష్‌ కుమార్‌ వద్ద నుంచి బాలికను తీసుకెళ్లారు. ఈ క్రమంలో బాలిక బంధువులతో మాట్లాడిన సతీష్‌ కుమార్‌ రూ.70 వేలు ఇవ్వాలని.. లేకపోతే వీడియోలను, ఫొటోలను సామాజిక మాధ్యమంలో విడుదల చేస్తానని బెదిరించాడు. దీనిపై బాలిక బంధువులు, తల్లిదండ్రులు పెరియకులం మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి సతీష్‌ కుమార్‌ను గురువారం పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు.

చదవండి   కారు పార్కింగ్ వివాదం.. కర్రతో చితక్కొట్టుకున్న రెండు కుటుంబాలు..

మరిన్ని వార్తలు