ప్రేమికులను కత్తితో బెదిరించి.. కొండపైకి తీసుకెళ్లి వివస్త్రలను చేసి..

13 Jun, 2022 11:33 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు

జయపురం(భువనేశ్వర్‌): ప్రేమికులను భయపెట్టి డబ్బులు డిమాండ్‌ చేసిన ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు జయపురం సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారి అరూప్‌ అభిషేక్‌ బెహర శనివారం తెలియజేశారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. జయపురం పారాబెడకు కొంతదూరంలో ఇద్దరు ప్రేమికులు శుక్రవారం మాట్లాడుతూ ఉండగా వారి వద్దకు ఇద్దరు యువకులు వెళ్లి భయపెట్టారు. తమ వద్దనున్న కత్తిని చూపించి ప్రేమికులను సమీప కొండపైకి తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ ఉన్న మరో ముగ్గురు దుండగులతో కలిసి ప్రేమికులను నగ్నంగా చేసి ఫొటోలు, వీడియోలు తీశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తామని హెచ్చరించి, రూ.50 వేలు డిమాండ్‌ చేశారు.

అయితే తమ వద్ద డబ్బులు లేకపోవడంతో రూ.7 వేల నగదును ప్రేమికులు దుండగులకు ఇచ్చారని వెల్లడించారు. శనివారం మరో రూ.13 వేలు ఇచ్చేందుకు అంగీకరించి, మిగతా రూ.30 వేలు నెల రోజుల్లో ఇస్తామని ప్రేమికులు దుండగులకు చెప్పినట్లు తెలిపారు. అనంతరం బందువుల సాయంతో వీరు శుక్రవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు చేసి 5 దుండగులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. అరెస్టైనవారిలో జయపురం కౌదంబ వీధి టుకున జాని, రోహిత్‌ గరడ, దీపక్‌ సావుడ్, కపిల పొరిచ, ఒక మైనర్‌ బాలుడు ఉన్నట్లు వెల్లడించారు. వారి వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లు, రూ.7 వేల నగదు, కత్తి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.


 

మరిన్ని వార్తలు