రాహుల్‌ హత్య కేసులో ఏ-2 నిందితుడు కోగంటి సత్యం అరెస్ట్‌

23 Aug, 2021 22:03 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యాపారి కరణం రాహుల్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ హత్య కేసులో ఏ-2 నిందితుడు కోగంటి సత్యంను అరెస్ట్ చేశారు. రాహుల్‌ హత్య తర్వాత రెండ్రోజులు విజయవాడలోనే ఉన్న కోగంటి సత్యం ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అయితే, పక్కా సమాచారం అందుకున్న విజయవాడ పోలీసులు కోగంటిని బెంగుళూరులో అరెస్ట్‌ చేసి, ఈ రాత్రి విజయవాడకు తీసుకువస్తున్నారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు కోరాడ విజయ్ కుమార్ పోలీసులకు లొంగిపోగా, తాజాగా కోగంటి సత్యంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
చదవండి: మైనర్‌ బాలిక శీలం ఖరీదు రూ.8 లక్షలు?

మరిన్ని వార్తలు