‘బాధితురాలు ఇచ్చింది రూ.38 లక్షలు మాత్రమే’

9 Sep, 2020 19:39 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : సింహాద్రి అప్పన్న ఆభరణాలు వేలం పాట పేరిట ఇప్పిస్తామని మోసగించిన కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోపాలపట్నం ప్రాంతానికి చెందిన హైమావతి తనకున్న పరిచయాన్ని ఆసరాగా తీసుకుని ఈ మోసానికి పాల్పడినట్టు గుర్తించారు. గత పదేళ్లుగా అప్పన్న ఆలయానికి వచ్చే నెల్లూరుకు చెందిన శ్రావణికి వేలం పాట ద్వారా స్వామి ఆభరణాలు ఇప్పిస్తామంటూ హైమవతి ఫోన్ చేయగా ఆమె విడత వారీగా బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు జమ చేసింది. దీనికి రసీదుగా సింహాచలం అప్పటి ఈవో భ్రమరాంబ సంతకాలు చేసినట్లు రెండు రసీదులు కూడా పంపించారు. (విజయవాడకు మరో వరం ప్రకటించిన సీఎం)

రోజుల తరబడి ఆభరణాలు రాకపోవడంతో అనుమానం వచ్చిన శ్రావణి భర్త నేరుగా ఫోన్ చేయడంతో మోసం బయటపడింది. కాకా హైమావతికి ఈ రసీదులు తయారు చేయడంలో  శ్రీకాకుళం జిల్లా చిన్న బరాటం వీధికి చెందిన మధు..విశాఖకు చెందిన శేఖర్ సహకరించినట్లు విచారణలో తేలింది. వీళ్లిద్దరు ఎన్ఏడి జంక్షన్ లో  రసీదు ద్వారకా నగర్లో సింహాచలం దేవస్థానం స్టాంపు తయారు చేయించినట్టు పోలీసులు విచారణలో వెల్లడైంది. కాగా ఈ వ్యవహారంలో కోటి 40 లక్షల రూపాయలు ఇచ్చినట్లు శ్రావణి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వగా విచారణ మాత్రం ఆమె 38 లక్షలు మాత్రమే ఇచ్చినట్టు గుర్తించారు. (వుడాకి పూర్వ వైభవం తీసుకువస్తాం..)

మరిన్ని వార్తలు