పల్సర్‌ బైక్‌లే టార్గెట్‌.. ఫంక్షన్‌కు వెళ్లినప్పుడు ఏర్పడిన పరిచయం..

18 Jul, 2022 17:08 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న బైక్‌లు

ఎమ్మిగనూరు రూరల్‌: బళ్లారి కౌల్‌ బజార్‌ ప్రాంతంలో పల్సర్‌ బైక్‌లే టార్గెట్‌గా చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోనెగండ్ల మండలం హెచ్‌.కైరవాడికి చెందిన హమన్, కడిమెట్లకు చెందిన మహేష్, శంకర్, విక్కిని నుంచి 30 పల్సర్‌ బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. గత నెలలో ఓ రిటైర్డ్‌ ఏఎస్‌ఐ బైక్‌ చోరీకి గురైంది. బళ్లారి కౌల్‌ బజార్‌ పోలీసులు బళ్లారిలో వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న అబ్దుల్‌ను అనుమానంతో అదుపులో తీసుకుకొని విచారణ చేపట్టగా బైక్‌ చోరీల వ్యవహారం వెలుగు చూసింది.  

కై రవాడికి చెందిన హమన్‌ బళ్లారిలో ఓ ఫంక్షన్‌కు వెళ్లినప్పుడు అబ్దుల్‌తో పరిచయం ఏర్పడింది. అబ్దుల్‌ బైక్‌లను చోరీ చేసి హమన్‌కు అప్పగించే వాడు. హమన్‌...కడిమెట్లకు చెందిన మహేష్, శంకర్, విక్కితో కలిసి  బైక్‌లను కేవలం రూ.15 వేల నుంచి రూ.20 వేల లోపు విక్రయించే వారు. ఆ బైక్‌లను కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రాంతంలో విక్రయించినట్లు సమాచారం ఇవ్వడంతో కౌలుబజార్‌ ఎస్‌ఐ శివకుమార్‌నాయక్‌ ఎమ్మిగనూరులో మకాం వేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. గోనెగండ్ల పోలీస్టేషన్‌ పరిధిలో 19, ఎమ్మిగనూరు రూరల్‌ స్టేషన్‌ పరిధిలో 11 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను బళ్లారికి తరలించారు. 

చదవండి: వ్యవసాయ అధికారి వంచన.. పెళ్లి చేసుకుంటానని మహిళను నమ్మించి

మరిన్ని వార్తలు