దేవాలయాల్లో హుండీల దొంగతనాలు.. దొంగ అరెస్టు

29 Sep, 2020 14:51 IST|Sakshi

సాక్షి, విజయవాడ : రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవాలయాల్లో హుండీలు పగలకొట్టి 80కు పైగా దొంగతనాలకు పాల్పడిన అంతరాష్ట దొంగను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 14వ తేదీన విస్సన్నపేట మండలంలోని కొర్లమండ దాసాంజనేయ స్వామి దేవస్థానంలో హుండీ దొంగతనం జరిగినట్లు నిందితునిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి పేరు పఘాన్‌ సలార్‌ ఖాన్‌ అని అతను కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి అని పోలీసులు గుర్తించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముద్దాయిని అరెస్ట్ చేసినట్లు వివరించారు. (దేవాలయాల్లో హుండీల దొంగతనాలు.. దొంగ అరెస్టు)

కొర్లమండ దేవస్థానంలో హుండీ ద్వంసం చేసి 2 వేలు, చిల్లకల్లు ఆంజనేయస్వామి దేవస్థానంలో హుండీ పగలకొట్టి 6 వేలు, మైలవరం మండలం ఎదురుబీడం రామాలయంలో హుండీ ద్వంసం చేసి 10,వేలు అపహరణ చేసినట్లు సీఐ యంశేఖర్ బాబు తెలిపారు. నిందితుడు వాడిన వాహనం, ఆయుధాలను స్వాధీనం చేసుకుని రిమాండ్ కొరకు తిరువూరు కోర్టుకు తరలిస్తున్నామని పేర్కొన్నారు. (వాట్సాప్‌ హ్యాక్‌: బాధితుల్లో సెలబ్రిటీలు!)

మరిన్ని వార్తలు