టులెట్‌ బోర్డు.. ఇంట్లో మహిళ ఒంటరిగా ఉండడంతో..

14 Jul, 2022 17:32 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తుమకూరు(బెంగళూరు): ఇల్లు అద్దెకు ఇస్తామని టులెట్‌ బోర్డు పెట్టగా దొంగలు వచ్చి ఓ మహిళను బంధించి కాళ్లు, చేతులు కట్టేసి బంగారు గొలుసు దోచుకెళ్లారు. ఎట్టకేలకు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నగరంలోని రింగ్‌ రోడ్డు వద్ద దుర్గప్ప అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఒక ఫోర్షన్‌ ఖాళీగా ఉండటంతో టులెట్‌ బోర్డు పెట్టాడు. వారం రోజుల క్రితం ఓ జంటతో సహా ఐదుగురు వ్యక్తులు వచ్చి ఇల్లు చూసి అడ్వాన్స్‌ ఇచ్చారు.

మరోసారి ఇల్లు చూసే నెపంతో వచ్చి దుర్గప్ప భార్యను కాళ్లు, చేతులు కట్టేసి 70 గ్రాముల బంగారు గొలుసును దోచుకుని పరారీ అయ్యారు. బాధితులు జయనగర పోలీసులకు ఫిర్యాదు చేయగా గాలింపు చేపట్టి రెండు రోజుల క్రితం ప్రమోద్, అతని భార్య హేమలత, రమేష్, సౌజన్య, తీర్థేశ్‌ అనే  నిందితులను అరెస్ట్‌  చేశారు.

చదవండి: Hyderabad: భర్తతో విడిపోయి ఒంటరిగా.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి..

మరిన్ని వార్తలు