నిందితున్ని నగ్నంగా ఊరేగింపు

25 Apr, 2022 08:09 IST|Sakshi

యశవంతపుర: బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన యువకున్ని అరెస్ట్‌ చేసిన పోలీసులు పోక్సో కేసు పెట్టి అతన్ని బట్టలు విప్పి ఊరేగించారు. ఇందులో బాలిక బంధువుల పాత్ర కూడా ఉంది. హావేరి జిల్లా హిరేకెరూరు తాలూకా హంసబావి పోలీసుస్టేషన్‌ పరిధిలో ఈ నెల 21న ఈ ఘటన జరిగింది. దీంతో యువకుని తల్లిదండ్రులు 11 మందిపై ఫిర్యాదు చేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వ్యాప్తి చెందింది.

(చదవండిన్యూసెన్స్‌ ప్రియుడు అరెస్టు )

మరిన్ని వార్తలు