యూట్యూబ్‌ చానెల్‌ పేరుతో ఇంట్లోకి చొరబడి, షూట్‌ చేస్తూ..

29 Jun, 2022 12:49 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మైసూరు(బెంగళూరు): యూట్యూబ్‌ చానెల్‌ పేరుతో ఇంట్లోకి చొరబడి డబ్బు డిమాండ్‌ చేసిన ఐదుమందిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నగరంలోని అశోక రోడ్డులో ఈ ఘటన జరిగింది. కర్ణాటక పబ్లిక్‌ వాయ్స్‌ న్యూస్‌ చానెల్స్‌ (కేవీపీ న్యూస్‌)కు చెందిన బసవరాజు, అభిలాష, మణి, నవీన్‌కుమార్, ప్రదీప్‌లు ఉమర్‌ షరీఫ్‌ అనే వ్యక్తి ఇంటికి కారులో వచ్చారు.

కెమెరాలతో షూట్‌ చేస్తూ మీ ఇంటిలో అక్రమంగా గ్యాస్‌ రీ ఫిల్లింగ్‌ జరుగుతోందని ఒకరు, తాము పోలీసులమని మరొకరు అతనిని గద్దించారు. డబ్బు ఇస్తే వెళ్లిపోతామని చెప్పారు. ఇంతలో స్థానికులు వారిని నిర్బంధించి పోలీసులకు అప్పగించారు. నిందితులపై కేసు నమోదు చేశారు.

చదవండి: పెళ్లయిన కొత్తలో విడిపోయి.. 52 ఏళ్ల తర్వాత ఒక్కటయ్యారు!

మరిన్ని వార్తలు