మహిళపై యూట్యూబర్‌ అఘాయిత్యం

11 Dec, 2020 21:05 IST|Sakshi

న్యూఢిల్లీ: మహిళను నమ్మించి మోసం చేసి అత్యాచారానికి పాల్పడ్డ యూట్యూబర్‌ను  పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన నోయిడాలో చోటుచేసుకుంది. వివరాలు.. రాజీవ్‌ కుమార్‌ అనే వ్యక్తి యూట్యూబ్‌లో ఫిట్‌నెస్‌ క్లాసులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో బాధితురాలితో అతడికి పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత విభేదాలు తలెత్తడంతో ఆమె అతడికి దూరంగా ఉండటం మొదలుపెట్టింది. దీంతో కోపం పెంచుకున్న రాజీవ్‌ ఆమెపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకునేందుకు పథకం రచించాడు. 

ఇందులో భాగంగా తనను కలవాలని ఉందంటూ ఓ చోటికి రప్పించాడు. స్నేహం కొనసాగిద్దామంటూ ఆమెను బతిమిలాడాడు. కానీ బాధితురాలు ఇందుకు నిరాకరించింది. ఈ క్రమంలో ఎలాగోలా నచ్చజెప్పి మత్తు మందు కలిపిన డ్రింక్‌ను ఆమెతో తాగించాడు. బాధితురాలు స్పృహ తప్పపడిపోగానే ఆమెపై లైంగిక దాడికి పాల్పడి వీడియో చిత్రీకరించాడు. అనంతం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. (చదవండి: ప్రేయసి బామ్మ, తమ్ముడిని చంపి.. ఆపై)

తాను మోసపోయిన విషయం గుర్తించిన ఆమె.. అతడిని నిలదీసింది. ఇక అప్పటి నుంచి బ్లాక్‌మెయిల్‌ చేయడం కూడా మొదలుపెట్టాడు. రూ. 13 లక్షలు ఇస్తేనే వీడియోను డిలిట్‌ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. అతడి ఆగడాలు పెచ్చుమీరడంతో బాధితురాలు సెక్టార్‌ 39 పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని గౌతం బుద్ధానగర్‌ డీసీపీ వృందా శుక్లా తెలిపారు. విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు