కొల్లేరులో సారా తయారీ గుట్టు రట్టు 

4 Nov, 2021 05:25 IST|Sakshi
కొల్లేరులో కిక్కిస పొదల మధ్య సారా తయారీ కేంద్రం

కిక్కిస పొదల మధ్య రహస్య కేంద్రాన్ని గుర్తించిన పోలీసులు 

వెయ్యి లీటర్ల సారా, 50 వేల లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం 

కైకలూరు: సారా తయారీపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కొల్లేరు సరస్సులో కిక్కిస పొదల మాటున సాగుతున్న సారా తయారీ కేంద్రం గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్, పలువురు పోలీసులు బుధవారం పడవలపై వెళ్లి ఆ స్థావరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కొన్ని రోజులుగా కొల్లేరు కిక్కిస పొదలపై నిఘా ఏర్పాటు చేశామన్నారు. కైకలూరు రూరల్‌ ఎస్‌ఐ చల్లా కృష్ణ పందిరిపల్లిగూడెం పరిధిలో కొల్లేరు సరస్సు మధ్యలో సారా తయారీ కేంద్రాన్ని మంగళవారం గుర్తించి దాడి చేశారని చెప్పారు.

అక్కడ వెయ్యి లీగర్ల సారా, సారా తయారీకి ఉపయోగించే 50 వేల లీటర్ల బెల్లపు ఊటను స్వా«దీనం చేసుకుని పందిరిపల్లిగూడెంకు చెందిన భలే సుబ్బరాజు (40), ఘంటసాల రాంబాబు (35), భలే కోటశివాజీ(35), ఆకివీడుకు చెందిన పన్నాస కృష్ణ (35) అనే వారిని అరెస్ట్‌ చేశారని వివరించారు. నిందితుల నుంచి సారా తయారీకి ఉపయోగించే రూ.6.80 లక్షల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు.   

మరిన్ని వార్తలు