ఆన్‌లైన్‌లో సెక్స్‌ పేరుతో.. మూడువేల మందికి..

16 Aug, 2020 19:51 IST|Sakshi

సాక్షి, విజయనగరం : ఆన్‌లైన్‌ హనీట్రాప్‌ కేసును విజయనగరం పోలీసులు ఛేదించారు. సెక్స్‌ పేరిట ఆన్‌లైన్‌లో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. టూ టౌన్ సీఐ సీహెచ్ శ్రీనివాసరావు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కొంతకాలం కిత్రం అశ్విన్ అనే వ్యక్తి  బ్రతుకు తెరువు కోసం విజయనగరం వచ్చి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. ఈ తరుణంలో సింధూ అనే యువతితో అతడికి పరిచయం అయ్యింది. మొదటి భార్య, పిల్లలతో పాటుగా ప్రేయసిని పోషించడం అశ్విన్‌కు కష్టమైంది. దీంతో ఆన్‌లైన్‌ సెక్స్ పేరుతో బిజినెస్‌ను ప్రారంభించారు. కస్టమర్లతో మాట్లాడటం, వారి స్థాయిని బట్టి 500 నుంచి 8 వేల రూపాయల వరకు ఛార్జ్ చేసేవాడు. ఆన్‌లైన్‌లోనే తన అకౌంట్‌కి డబ్బులను ట్రాన్స్‌ఫర్‌ చేయించుకునేవాడు. ( సైకో యువకుడు: మనిషి పుర్రెను..)

డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ అయిన తరువాత ఫోన్ స్విచ్‌ ఆఫ్‌ చేసేవాడు. ఇలా మూడు వేల మందిని మోసం చేశాడు. అశ్విన్‌ గత మూడేళ్లుగా లొకాంటో యాప్  ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తున్నాడు. ఇలా నెలకు ఇరవై అయిదు వేల రూపాయల వరకు దండుకునే వాడు. అయిదు రోజుల క్రితం అమెరికా నుంచి నరేశ్‌ రెడ్డి అనే వ్యక్తి ఆన్‌లైన్‌ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అశ్విన్‌ గుట్టురట్టయింది. పోలీసులు అశ్విన్‌తో పాటు అతడి ప్రేయసి సింధూను కూడా అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు