‘అరబిక్‌’లో అశ్లీలంపై కేసు 

19 Sep, 2022 15:48 IST|Sakshi

సాక్షి, కదిరి (శ్రీసత్యసాయి జిల్లా): పట్టణంలోని అరబిక్‌ రెస్టారెంట్‌లో జరిగిన రాసలీలలపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ‘రెస్టారెంట్‌లో రాసలీలలు’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’లో కథనం వెలువడిన విషయం తెలిసిందే. దీనిపై పట్టణ పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ఆ రెస్టారెంట్‌లో జరిగిన రాసలీలలకు సంబంధించిన సీసీ పుటేజ్‌ని పోలీసులు  క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఆ ఇద్దరినీ ప్రేమ   జంటగా నిర్ధారించారు.

పట్టణంలో     కదిరి–అనంతపురం రోడ్డులో ఉన్న ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నారని పోలీసుల విచారణలో వెల్లడైంది. తనకు మాయమాటలు చెప్పి రెస్టారెంట్‌కు తీసుకెళ్లి తనకు తెలియకుండా సీసీ కెమెరాలో బంధించి, తనను మోసగించాడని ఆ యువతి పోలీసుల ఎదుట వాపోయినట్లు సమాచారం.

బాధితురాలి ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. పట్టణ నడిబొడ్డున రద్దీగా ఉండే ప్రాంతంలో పట్టపగలు ఇలాంటి ఘటన చోటు చేసుకుంటే పోలీసులు సదరు రెస్టారెంట్‌ నిర్వాహకుడిపై ఎలాంటి కేసు నమోదు చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

చదవండి: (ఛీ..ఛీ..ఇదేం పాడు పని...ఫ్యామిలీ రెస్టారెంట్‌లో...)

మరిన్ని వార్తలు