అర్ధరాత్రి హైవేపై.. సినిమాను తలపించే రీతిలో

9 May, 2021 09:11 IST|Sakshi
ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దొంగలు- దొంగలు వదిలి వెల్లిన ద్విచక్ర వాహనం  

పోలీసులు ఛేజింగ్‌

తృటిలో తప్పించుకున్న నిందితులు

బైకు, రెండు సెల్‌ఫోన్లు, మారణాయుధాలు స్వాధీనం 

టంగుటూరు (ప్రకాశం జిల్లా): ఇటీవల జాతీయ రహదారిపై వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో  సింగరాయకొండ సీఐ శ్రీనివాసరావు, టంగుటూరు ఎస్‌ఐ నాయబ్‌ రసూల్‌లు జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి స్థానిక టోల్‌ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. ఓ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులను పోలీసులు ఆపినా ఆపకుండా తప్పించుకుని పోయారు. అప్రమత్తమైన పోలీసులు సుమారు అరగంట పాటు జాతీయ రహదారిపై ఛేజింగ్‌ చేశారు.

దొంగలు తప్పించుకునే క్రమంలో పోలీసుల వాహనాన్ని గుద్దారు. ద్విచక్ర వాహనాన్ని అక్కడే వదిలి తూర్పునాయుడుపాలెం గ్రామంలోకి చోరబడ్డారు. పోలీసులు, గ్రామస్తులు రెండు గంటల పాటు గ్రామాన్ని జల్లెడ పట్టినా నిందితులు తృటిలో తప్పించుకున్నారు. ద్విచక్ర వాహనం, రెండు సెల్‌ఫోన్లు, మారణాయుధాలు స్వా«దీనం చేసుకున్నారు. దొంగల ఆచూకీ కనుగొన్నామని, అతి త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు విశ్వాసం వ్యక్తం చేశారు.

చదవండి: బావిలో నుంచి కేకలు.. అసలు ఏం జరిగిందంటే..?  
కరోనా కల్లోలం: ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు