కోర్టు ఎదుట డ్రైనేజీలో మహిళ మృతదేహం, వీడిన మిస్టరీ!

26 Mar, 2021 11:35 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌ కోర్టు బస్టాప్‌ వద్ద డ్రైనేజీలో శవమై తేలిన మహిళ హత్య కేసు మిస్టరీని పో లీసులు ఛేదించినట్లు తెలుస్తోంది. సీసీ ఫుటేజీల ఆ ధారంగా మిస్టరీ వీడినట్లు సమాచారం. మంచి ర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం ఉట్కూర్‌కు చెంది న కవితగా గుర్తించిన పోలీసులు ఆమెను భర్త కమలాకర్‌ హత్య చేశాడని ప్రాథమికంగా నిర్ధారణకు వ చ్చినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్ర కారం.. కవితకు చిన్న వయసులోనే లక్షెట్టిపేట ప్రాంతానికే చెందిన కమలాకర్‌తో పరిచయం ఏర్పడింది.

ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఆమెకు మ రో వ్యక్తితో వివాహం జరిపించారు. వీరికి ముగ్గురు పిల్లలు జన్మించారు. 11ఏళ్ల తర్వాత కమలాకర్‌ మళ్లీ కవిత జీవితంలోకి వచ్చాడు. ఆమెకు మాయమాట లు చెప్పి హైదరాబాద్‌కు తీసుకెళ్లి నివాసం ఉంటున్నారు. కవిత ప్రవర్తన వల్ల వారి మధ్య తరచూ గొ డవలు జరుగుతున్నాయి. కరీంనగర్‌లో నివాసం ఉందామని ఇల్లు అద్దెకు తీసుకునేందుకు కారులో సోమవారం రాత్రి వచ్చారు. ఇద్దరి మధ్య గొడవ తీ వ్రమైంది. కోర్టు వద్ద కారు దిగారు. కోర్టు బస్టాప్‌ వ ద్ద గొడవ తీవ్రమై కవిత అక్కడి నుంచి డివైడర్‌ దాటే క్రమంలో గుర్తు తెలియని వాహనం తగిలింది.

అక్కడి నుంచి కవితను తీసుకొచ్చిన కమలాకర్‌ బస్టాప్‌ లో కూర్చోబెట్టి చున్నీతో మెడకు బిగించి ఊపిరాడకుండా చేశాడు. మృతదేహాన్ని డ్రైనేజీలో పడేసి వెళ్లి నట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని పోలీసులు తీసుకెళ్లే వరకు అతడి తమ్ముడు కోర్టు చౌరస్తాలోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాతోపాటు కోర్టు ఏరియా టవర్‌ లొకేషన్‌లో ఉన్న మొబైల్స్‌ కాల్‌ డే టాలోని అనుమానిత నంబర్ల ఆధారంగా కేసును ఛే దించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసుల ప్రత్యేక బృందం రంగంలోకి దిగినట్లు సమాచారం.

చదవండి: 
అనుమానాస్పద మృతి: కోర్టు ఎదుట డ్రైనేజీలో..

మరిన్ని వార్తలు