‘నాతో వివాహేతర సంబంధం ఉన్న మహిళతో నీవెలా మళ్లీ’

7 Jul, 2021 11:28 IST|Sakshi
ప్రతీకాత్మక చిద్రం

అడివెంలలో యువకుడిని చంపిన నిందితుల రిమాండ్‌

వివాహేతర సంబంధమే కారణం 

సాక్షి, నల్గొండ : అడివెంలలో జరిగిన యువకుడి హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తే ల్చారు. డీఎస్పీ ఎస్‌. మోహన్‌కుమార్‌ మంగళవా రం నాగారం సర్కిల్‌ కార్యాలయంలో హత్యకేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జాజిరెడ్డిగూడెం మండలం అడివెంల గ్రామంలో ఈనెల 2న రాత్రి శతకోటి సుజాత పెద్దకుమారుడు శతకోటి శైలేందర్‌ అలియాస్‌ సైదులు(27) దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ హత్య కేసు మిస్టరీని పోలీసులు వేగంగా దర్యాప్తు జరిపి 4రోజుల్లో ఛేదించారు. అదేగ్రామానికి చెందిన బొర్ర శైలేందర్‌ తన స్నేహితుడు నేరెల్ల సతీష్‌ సహకారంతో హత్యకు పాల్పడినట్లు చెప్పారు.

గ్రామానికి చెందిన ఓ మహిళతో గత పదేళ్ల నుంచి నిందితుడు బొర్ర శైలేందర్‌ వివాహేతర సంబంధాన్ని కొనసాగి స్తున్నాడు. అయితే ఏడాది క్రితం బొర్ర శైలేందర్‌కు వివాహం జరిగింది. 4నెలల నుంచి వివాహేతర సంబంధం కలిగిన మహిళతో నిందితుడు శైలేందర్‌కు మనస్పర్థలు వచ్చి ఆ మహిళతో దూరంగా ఉంటున్నాడు. ఆ మహిళ మృతుడు శతకోటి సైదులుతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుంది. ఇది తెలిసిన నిందితుడు బొర్ర శైలేందర్‌ సైదులును పలు మార్లు హెచ్చరించాడు. తనతో వివాహేతర సంబంధం ఉన్న మహిళతో నీవెలా మళ్లీ సంబంధం పెట్టుకుంటావని ఘర్షణ పడ్డాడు. కాని సైదులు ఆమెతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించడంతో బొర్ర శైలేందర్‌ గత నెల 29న తన స్నేహితుడు సతీష్‌తో కలిసి హత్యకు పథకం వేయగా సక్సెస్‌ కాలేదు.

ఈ నెల 2న రాత్రి సైదులు గ్రామంలోని ఓ బెల్టు దు కాణంలో మద్యం సేవిస్తూ మూత్ర విసర్జన కోసం బయటకు వచ్చాడు. తన స్నేహితుడు సతీష్‌ సహకారంతో పథకం ప్రకారం దారికాచి ఉన్న శైలేందర్‌ కత్తితో సైదులు మెడపై నరికి హత్య చేశాడు. అ యితే శైలేందర్‌ పారిపోగా పోలీసులు వారి సెల్‌ నంబర్ల కాల్‌డేటాను సేకరించి నిందితులను గుర్తించా రు. మంగళవారం హత్యకేసులో నిందితులైన బొర్ర శైలేందర్, నేరెల్ల సతీష్‌లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐలు రాజేష్, శ్రీనివాస్, ఎస్‌ఐలు ఉన్నారు. 

మరిన్ని వార్తలు