పొద్దుపొద్దున్నే ఛేజింగ్‌, కాల్పులు

1 Sep, 2020 08:11 IST|Sakshi
గాయపడిన ఓ నిందితుడు

బెంగళూరు  : ఐటీ సిటీలో నడిచి వెళ్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్తున్న దొంగలపై పోలీసులు కాల్పులు జరిపి పట్టుకున్నారు. సినిమాలో మాదిరిగా ఛేజింగ్, కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్, పంజాబ్‌కు చెందిన దొంగలు సుభాష్‌ (30), సంజయ్‌ (31)లు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆటోడ్రైవర్‌ సమాచారంతో  సోమవారం తెల్లవారుజామున 5:45 సమయంలో రాజాజీనగర పోలీసుస్టేషన్‌ పరిధిలోని పాత పోలీసుస్టేషన్‌ సర్కిల్‌లో మహిళ నడిచివెళ్తుండగా ఇద్దరు దొంగలు గొలుసు తెంచుకుని పరారయ్యారు. ఇది చూసిన ఓ ఆటో డ్రైవర్‌ వెంటనే పోలీసు కంట్రోల్‌ రూంకి సమాచారమిచ్చాడు. సీఐ వెంకటేశ్‌ జీపులో, శ్రీరాంపుర ఎస్‌ఐ వినోద్‌నాయక్‌ బైకు మీద వారి వెంట పడ్డారు. మహలక్ష్మీ లేఔట్‌ వద్ద ఎస్సై బైక్‌ నుంచి కిందపడ్డాడు. అయినప్పటికీ సీఐ వెంకటేశ్, ఎస్‌ఐ వినోద్‌ నాయక్‌లు దొంగల వెంటపడి లొంగిపోవాలని హెచ్చరించారు.  ( మహిళ మంటల్లో కాలుతున్నా పట్టించుకోకుండా..)

దొంగల ఎదురుదాడి  
దుండగులు వినకుండా ఎదురుదాడి చేయడంతో ఎస్‌ఐ వినోద్‌నాయక్‌ పిస్టల్‌తో కాల్పులు జరపడంతో దుండగులకు తూటాలు తగిలి కిందపడిపోయారు. దొంగల దాడిలో ఇద్దరు పోలీసులు కూడా క్షతగాత్రులయ్యారు. అందరినీ ఆస్పత్రికి తరలించారు. దుండగులపై సంజయనగర, కామాక్షిపాళ్య, మాగడిరోడ్డు, బాగలకుంటె పీఎస్‌లలో పలు కేసులున్నట్లు తెలిపారు.  

మరిన్ని వార్తలు