వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి కార్యాలయంలో పోలీసుల తనిఖీ

16 May, 2021 03:22 IST|Sakshi
రికార్డులను పరిశీలిస్తున్న పోరుమామిళ్ల సీఐ మోహన్‌రెడ్డి

పులివెందుల: వైఎస్సార్‌ జిల్లా భాకరాపురంలోని పేలుడు పదార్థాల లైసెన్సు హోల్డర్‌ వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి కార్యాలయంలో శనివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పోరుమామిళ్ల సీఐ మోహన్‌రెడ్డి తమ సిబ్బందితో కలిసి శనివారం మధ్యాహ్నం వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి కార్యాలయానికి చేరుకున్నారు. పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని విచారించారు. పేలుడు పదార్థాలు, వాటి నిల్వలతో పాటు ఎవరెవరికి సరఫరా చేస్తారు? తదితర విషయాలపై వారిని ప్రశ్నించినట్లు సమాచారం. మామిళ్లపల్లె వద్దనున్న ముగ్గురాళ్ల క్వారీలో ఈనెల 8న పేలుళ్లు సంభవించి 10 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి క్వారీ లీజుదారుడు నాగేశ్వరరెడ్డి, జిలెటిన్‌ స్టిక్స్‌ సరఫరా చేసిన రఘునాథరెడ్డితో పాటు పులివెందులకు చెందిన వైఎస్‌ ప్రతాప్‌రెడ్డిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు