కన్నకూతుళ్లపై పోలీస్‌ లైంగిక వేధింపులు

30 Jul, 2021 07:03 IST|Sakshi

సాక్షి , చెన్నై: చెన్నైలో పనిచేసే పోలీసు కానిస్టేబుల్‌ ఇలంగోవన్‌ తన ఇద్దరు కుమార్తెలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు అతని భార్య గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. గురువారం చెన్నై కీల్పాక్‌ పోలీసుస్టేషన్‌లో ఆమె ఇచ్చిన ఫిర్యాదులో ఇలా ఉన్నాయి. 2006లో ఇలంగోవన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మాకు 13, 11 ఏళ్ల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

భర్త ఇలంగోవన్‌ అసభ్య పదజాలం, చేష్టలతో ఇద్దరు కుమార్తెలను లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. నిలదీసిన మాపై భౌతికదాడులకు పాల్పడుతున్నాడు. దీంతో విరక్తి చెందిన నేను, కుమార్తెలు కొన్ని నెలల క్రితం నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేయగా, కొందరు అడ్డుకున్నారు. ఆ తర్వాత కూడా ఇలాగే లైంగిక వేధింపులు కొనసాగడంతో ఈ ఏడాది మార్చిలో మరోసారి ఆత్మహత్యాయత్నం చేయగా కీల్పాక్‌ ఆస్పత్రిలో చేరి కోలు కున్నాం. నా భర్తపై చర్యలు తీసుకుని నన్ను నా పిల్లలను కాపాడాలని ఆమె వేడుకుంది. ఇలంగోవన్‌ భార్యకు మద్దతుగా జననాయక మాదర్‌ సంఘం సభ్యులు పోలీసుస్టేషన్‌ వద్దకు తరలిరావడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.  

మరిన్ని వార్తలు