ప్రేమ పేరుతో కానిస్టేబుల్‌ అఘాయిత్యం

13 Sep, 2020 08:12 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చెన్నై : యువతితో సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియో తీసి దాన్ని చూపి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేసిన పోలీసు కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. చెన్నై అంబత్తూరుకు చెందిన యువతి (21) ఆగస్టు 28వ తేదీన వేలూరులోని మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అందులో వేలూరు సెంట్రల్‌ జైలులో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ గణేష్‌కుమార్‌ తనకు తనకు ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం అయ్యాడని పేర్కొంది. ఆ పరిచయం ప్రేమగా మారిందని తెలిపింది. తాను ఫిబ్రవరిలో వేలూరు వచ్చానని వెల్లడించింది. గణేష్‌కుమార్‌ ఉంటున్న పోలీస్‌ క్యార్టర్స్‌కు తనను తీసుకెళ్లి కూల్‌ డ్రింక్స్‌లో మత్తు మందు కలిపి ఇచ్చాడని తెలిపింది. తాను మత్తులో ఉండగా తనపై అత్యాచారం చేశాడని, దాన్ని చూపించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని వాపోయింది. (గ‌ర్ల్‌ఫ్రెండ్ ఫోన్ ఎత్త‌ట్లేద‌ని..)

పెళ్లి చేసుకోవాలని అడిగితే మోసం చేసి వేరే యువతిని చేసుకునేందుకు సిద్ధమయ్యాడని తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. జైలు కానిస్టేబుల్‌ గణేష్‌కుమార్‌ను వందవాసి సబ్‌ జైలుకు బదిలీ చేశారు. గణేష్‌ కుమార్‌ ఆ యువతిని తరచూ ఫోన్‌లో బెదిరిస్తున్నాడు. ఆమె ఆడియోలను పోలీసులకు చూపించడంతో కేసు నమోదు విచారణ చేస్తున్నారు. గణేష్‌ కుమార్‌ గత నెల రోజులుగా విధులకు హాజరుకాకుండా పరారీలో ఉన్నట్లు తెలిసింది. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జైలు ఉన్నతాధికారులు కానిస్టేబుల్‌ గణేష్‌కుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ శనివారం ఉదయం ఆదేశాలు జారీ చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా