ఆంధ్రా పోలీసులుకు పశ్చిమ బెంగాల్‌ ప్రశంస..

30 Aug, 2021 12:23 IST|Sakshi
నిందితుడు, బాలికతో పోలీసులు

సాక్షి,ఆత్రేయపురం: పశ్చిమ బెంగాల్‌కు చెందిన బాలిక కిడ్నాప్‌ కేసును ఆంధ్రా పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఈ మెయిల్‌లో పంపిన బాలిక ఆచూకీ ఆధారంగా కొన్ని గంటల్లోనే బాలికను, నిందుతుడ్ని కనుగొనడంతో ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శాఖకు పశ్చిమ బెంగాల్‌ పోలీసులు ప్రశంసలు అందించారు. ఎస్సై నరేష్‌ కథనం ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌ బెంగాల్‌కు చెందిన బాలికను ఓ వ్యక్తి కిడ్నాప్‌ చేసి ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో తన అ«దీనంలో ఉంచుకున్నాడు. నిందితుడు అదే గ్రామంలో ఇటుక బట్టీలో వలస కూలీగా పని చేస్తున్నాడు. ఆ బాలిక గురించి నార్త్‌–24 పరగనాస్‌ జిల్లాలోని మటియా పోలీసు స్టేషన్‌ నుంచి తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయానికి మెయిల్‌ ఇచ్చారు. ప్రేమ పేరుతో ఆమెకు మాయమాటలు చెప్పి కిడ్నాప్‌ చేసినట్టు సమాచారం వచ్చింది.

దీనిపై జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు స్పందించి అమలాపురం డీఎస్పీ వై.మాధవరెడ్డికి సమాచారం అందించారు. ఆయన పర్యవేక్షణలో రావులపాలెం సీఐ కృష్ణ, ఎస్సై నరేష్‌, పోలీసు సిబ్బందితో రెండు బృందాలుగా సాంకేతిక పరిజ్ఞానంతో అంకంపాలెంలో బాలికను, కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని గుర్తించారు. దీనిపై అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పశి్చమ బెంగాల్‌ పోలీసులు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకుని, బాలికను ఆమె బంధువులకు అప్పగించారు. ట్రాన్సిట్‌ వారెంట్‌పై నిందుతుడిని ఆంధ్రప్రదేశ్‌ నుంచి పశ్చిమ బెంగాల్‌కు తరలించేందుకు కోర్టు అనుమతులు మంజూరు చేసింది. దీంతో నిందితుడిని, బాలికను వారి బంధువులు పశి్చమ బెంగాల్‌కు తీసుకువెళ్లారు. సమాచారం వచ్చిన వెంటనే స్పందించిన రావులపాలెం సీఐ కృష్ణ, ఎస్సై నరేష్‌,ను ఎస్పీ అభినందించారు.

చదవండి: మూడు రోజుల్లో అత్తింటికి రావాల్సి ఉండగా.. దారుణం  

మరిన్ని వార్తలు