మధుసూదన్‌రెడ్డి కిడ్నాప్, హత్య కేసులో విచారణ ముమ్మరం

24 Aug, 2021 11:33 IST|Sakshi

హైదరాబాద్‌: మధుసూదన్‌రెడ్డి కిడ్నాప్, హత్య కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. దర్యా​ప్తులో.. మధుసూదన్‌రెడ్డిని గంజాయి మాఫియానే హత్య చేసినట్లు గుర్తించారు. నిందితులు కర్ణాటక బీదర్‌కు చెందిన సంజయ్, జగన్నాథ్, హరీష్, సంజీవ్‌గా పేర్కొన్నారు. గత నెలలో గంజాయి తీసుకొస్తుండగా సంజయ్‌ గ్యాంగ్‌ను ఏపీ పోలీసులు పట్టుకున్నారు. కాగా గంజాయి స్మగ్లింగ్‌ కోసం లారీ, డబ్బుని మధుసూదన్‌రెడ్డి సమకూర్చారు.  చదవండి: Pani Puri Man Viral Video: ఓరి దుర్మార్గుడా.. పానీపూరీలో అది కలిపావేంట్రా

అనుకోకుండా గంజాయ్‌ గ్యాంగ్‌ పోలీసులకు పట్టుబడటంతో డబ్బు తిరిగి ఇవ్వాలని అతను ఒత్తిడి తీసుకొచ్చాడు. దీంతో కిడ్నాప్‌ చేసి హత్యకు స్కెచ్ ప్లాన్‌ చేశారు. రౌడీషీటర్‌ ఎల్లంగౌడ్‌ హత్య కేసులో మధుసూదన్‌రెడ్డి నిందితుడుగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో మధుసూదన్‌రెడ్డి హత్య వెనకాల ప్రతికారం కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

చదవండి: ఇంటి నుంచి పనిచేయడానికేనా ఉద్యోగం?

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు