‘మధ్యాహ్నం హత్య’.. భర్తను పట్టించిన చేతి గోళ్లు

10 May, 2022 21:29 IST|Sakshi

ముంబై: భార్యభర్తల గొడవలనేవి సహజం. కలహాలు లేని కాపురమే ఉండదు. కానీ ఆ మనస్పర్థలు సద్దుమణిగి కలిసిపోతే అసలు సమస్యే ఉండదు. చిలికి చిలికి గాలివానలా మారితేనే కష్టం. పోనీ ఎవరిమానాన వారు బతికినా పర్వాలేదు గానీ కక్ష పెంచుకుని దారుణమైన నేరాలకు పాల్పడితే ఇరు జీవితాలు నాశనమవుతాయి. అచ్చం అలాంటి సంఘటనే ముంబైలో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే...ముంబైలో సకినాకాలోని ఖైరానీ రోడ్ ప్రాంతంలో మనోజ్ ప్రజాపతి, అతని భార్య రీమా భోలా యాదవ్ నివశిస్తున్నారు. ఐతే వారు గత రెండు రోజులుగా విడివిడిగా నివశించడం మొదలు పెట్టారు. అనుకోకుండా ఒక రోజు రీమా స్నేహితురాలు ఇంటికి వచ్చి చూసేటప్పటికీ ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో పోలీసులు రీమా స్నేహితురాలు ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలికి వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు.

ఈ క్రమంలో రీమా భర్తను అదుపులోకి తీసుకుని విచారించారు. ఐతే అతను తొలుత కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాడు. కానీ నిందితుడి గోళ్లపై ఉన్న రక్తపు మరకలే అతన్ని పట్టుబడేలా చేశాయని పోలీసులు తెలిపారు. రీమా తన మొబైల్‌లో చివరిసారిగా తన భర్తతోనే సంభాషించినట్లు వెల్లడించారు. దీంతో పోలీసులు రీమా భర్తను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.

(చదవండి: ‘నారాయణ స్కూళ్లలో అడ్మిషన్లు పెంచేందుకే పేపర్‌ లీక్‌’)

మరిన్ని వార్తలు